సర్వేపల్లి అభివృద్ధి…?

సర్వేపల్లి శాసనసభ్యులు చూస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్తున్నారు మరి వారి అనుచరులు చూస్తే నియోజకవర్గంలోని అక్రమ గ్రహబలం తరలిస్తున్నారు మరి అభివృద్ది అంటే ఇదేనా..? సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం పరిధిలో ఉన్నటువంటి రామదాస్ కండ్రిగ అలాగే వివిధ గ్రామాలలో అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎవరు పట్టించుకోకపోవడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే అడిగితే పర్మిషన్ తీసుకున్నాము అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు గాని, గనులశాఖ వారు గాని పరిమితికి మించి తవ్వకాలు జరుగుతుంటే పట్టించుకోరా..? పర్మిషన్ తీసుకునేది గోరంత తవ్వకాలు జరిపేది కొండంత. దయచేసి ప్రభుత్వ అధికారులు, గనులశాఖ వారు ఎవరైనా సరే ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నామని సర్వేపల్లి జనసేన తెలిపింది. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రవికుమార్, సందీప్, శ్రీను, శ్రీహరి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.