మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిన సత్యదేవ్!

విభిన్న కాదాంశాల చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు తెలుగు యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా ఈ యంగ్ హీరో సూపర్ ఛాన్స్ కొట్టేశాడట.

ఖైదీ 150 సినిమాతో చిరంజీవి తన సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన సైరా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్‏లో ఆచార్య సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ మరో మూడు చిత్రాల్లో నటించనున్నట్లుగా టాక్. వీటిలో మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మలయాళంలో ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించగా.. తెలుగులో చిరంజీవి నటించనుండగా.. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ పాత్ర కోసం స్వయంగా చిరంజీవే సత్యదేవ్ పేరును సూచించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇటీవల సత్యదేవ్, మెగాస్టార్ చిరంజీవిని కలవడం. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. లూసిఫర్ రీమేక్‏లో నిజంగానే ఈ యంగ్ హీరో నటిస్తున్నాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రకటనలు త్వరలోనే రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *