జనంలోకి దూసుకెళ్తున్న సీతంపేట జనసేన

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం, నవగడ గ్రామములో ఆదివారం గ్రామ యువత కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వివరించడం జరిగింది. వారు గిరిజన ప్రాంతాల్లో పడుతున్న ఇబ్బందులను వారు వివరించడం జరిగింది. ఈ సారి మా గిరిజన ప్రాంతాల్లో జనసేన జెండాను ఎగరవేస్తామని ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. వారికి భరోసాగా పార్టీ నుంచి మేము అండగా ఉంటుందని జనసేన పార్టీ నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ పోరెడ్డి జామి అనిల్, కుండంగి శ్రీకాంత్, కడ్రక సాయి, మండంగి విశ్వనాధం, సవర గణేష్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొనడం జరిగింది.