సీనియర్ సిటిజన్స్ గౌరవ కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం వాడ్రేవు లోవరాజు & చీకట్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో 31వ డివిజన్ బ్యాంకుపేట ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు సీనియర్ సిటిజన్స్ శ్రీమతి. రౌతుల వెంకట రమణమ్మ, శ్రీమతి. అనసూరి సీతారత్నం గార్ల ఇంటికి వెళ్ళి కలుసుకుని వారియొక్క క్షేమ సమాచారం తెలుసుకున్నారు. వారిని కలిసి వారు స్వతంత్రపోరాటం దగ్గరనుండీ నేటి ప్రస్తుత పరిస్థితులను వాతావరణాన్ని చూసారంటూ వారి అనుభవాన్ని జతచేస్తూ నేడు ప్రజల సంక్షేమం లోను, పాలనలోను తీసుకొనవలసిన ముఖ్యమైన నిర్ణయాలను మెరుగైన సూచనలతో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళేందుకు తమ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో సూచించవలసినదిగా కోరుతూ వారికి పోస్టల్ కవరుని అందచేసి విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న అసమానతలను రూపుమాపేందుకు వీరి అనుభవం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్దలని గౌరవించడం కాదుకదా కనీసం పట్టించుకునే తీరికకూడా లేదనీ, ఈ ముఖ్యమంత్రి మనస్తత్వం ఓటు బ్యాంకు మీద ప్రేమ తప్ప భావితరాలను తీర్చిదిద్దే పెద్దల మీద ఉండదని విమర్శించారు. లోగడ మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని అనేవారనీ కానీ నేడు రాజే మొండివాడు అయితే ఎలాఉంటాదో ఈ వై.సి.పి ప్రభుత్వం వచ్చాకా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల దుర్గాప్రసాద్, చీకట్ల శ్రీనివాస్, హైమావతి తదితరులు పాల్గొన్నారు.