మార్కెట్లో సీరం టీకా ధర..?

బహిరంగ మార్కెట్‌లో ఒక్కో కొవిషీల్డ్‌ డోసు ధర వెయ్యి రూపాయలుగా విక్రయిస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఒ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. అయితే దేశంలోని సామాన్యులు, పేదలు, ఆరోగ్య కార్యకర్తలకు వీటిని తక్కువ ధరకు సమకూర్చుతున్నామని, ఒక్కో డోసును రూ.200లకే ప్రత్యేక ధర కింద అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తొలి 10 కోట్ల డోసులను సరఫరా చేస్తున్నామని చెప్పారు. కొవిషీల్డ్‌ టీకా కోసం అనేక దేశాలు పిఎంఒను సంప్రదిస్తున్నాయని, ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు టీకాను పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.