మదనపల్లి జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన షాజహాన్ బాషా

మదనపల్లి, జనసేన పార్టీ నా సేన కోసం నావంతు కార్యవర్గ సభ్యులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, దారం హరిప్రసాద్ నివాసానికి వెళ్లి తెలుగుదేశం-జనసేన-భాజపా మదనపల్లి అభ్యర్థి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా మరియు తెలుగుదేశం నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి నడిబొడ్డులో ఉన్న ఎవి నాయుడు కాలనిలోని రోడ్లు, మురికి కాలువలు లేక రోడ్లపై నిల్వ ఉన్న మురుగు నీరు గురించి మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మీ సమస్య పరిష్కారం చేసే భాద్యత తనదని ఈ సందర్భంగా మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులుతో పాటు మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, కుప్పాల శంకర, అశ్వత్, ధరణి, సోను, సుప్రీం హర్ష, గణేష్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.