బైక్ యాత్ర చేపట్టిన దీపక్ ను అభినందించిన శివకోటీ యాదవ్

  • పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆంద్రప్రదేశ్ లో నర్సంపేట జనసైనికుడి బైక్ యాత్ర
  • దీపక్ కృషిని అభినందిస్తూ ఫోన్ సంభాషణ ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తూ ఈ విషయాన్ని పార్టీ ఉపాధ్యక్షులు గునూరి. మహేందర్ రెడ్డి మరియు రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ లకు తెలిపిన నియోజకవర్గ నాయకుడు శివ కోటీ యాదవ్

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గఒ బుధరావుపేట గ్రామానికి చెందిన జన సైనికుడు గుండెగాని దీపక్ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతో.. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయానికి తన వంతు కృషిగా ఆంద్రప్రదేశ్ లో ఉన్న జన సైనికులను ఉత్తేజపరిచే విధంగా వారిలో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా జనసేన బైక్ యాత్ర ను చేపట్టడం జరిగింది. ఈ యాత్రను నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు.శివ కోటీ యాదవ్ స్ఫూర్తితో నర్సంపేట నుంచి మొదలుకొని శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు విజయవంతంగా కొనసాగుతుందని దీపక్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు మేరుగు శివకోటీ యాదవ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని నర్సంపేట జన సైనికుడు దీపక్ తన దైన శైలిలో బైక్ యాత్రను ప్రారంభించి కృషి చేయడం అభినందనీయం మరియు జన సైనికులు అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అలాగే దీపక్ ఆంద్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ ఉన్న ముఖ్యనేతల మన్నలని పొందుతూ అక్కడి జన సైనికులను ఉత్తేజ పరుస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అలాగే దీపక్ కి ఫోన్ సంభాషణ ద్వారా పలు జాగ్రత్తలు సూచనలు చేస్తూ, ఈ విషయాన్ని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి. మహేందర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ లకు తెలుపడం జరిగింది అన్నారు.