మానవత్వంతో స్పందించిన జనసైనికులు

తిరువూరు నియోజకవర్గం: విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల గ్రామానికి చెందిన గోదా చెన్నారావు ఇటీవల ప్రమాదానికి గురియ్యారని తెలుసుకొని విస్సన్నపేట మండల జనసేన పార్టీ కమిటీ తరుపున వారిని పరామర్శించి, వారికి కొంత మొత్తం ఆర్థిక సహాయం అందిచడం జరిగింది. అలాగే వారి చికిత్స కొరకు మేము అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ యాసిన్, ఉపాధ్యక్షులు తేజ, ప్రధాన కార్యదర్శిలు నందమూరి వెంకటేశ్వరరావు, సీతారామస్వామి బిళ్ళ నారాయణ, నాగరాజు, ప్రకాష్, గణేష్, అశోక్, ప్రవీణ్, రాజేష్ పాల్గొన్నారు.