రియల్ హీరోకు హైదరాబాద్ లో ఘన స్వాగతం, సన్మానం

రియల్‌ హీరోగా నిలిచిన సోనూ సూద్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. లాక్ డౌన్ టైంలో వలస కార్మికుల కోసం కోట్లు ఖర్చు చేసి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన సోనూ సూద్ రియల్ హీరో అయ్యాడు. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చడంలో సోనూ సూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. సోనూసూద్ కేవలం వలస కార్మికుల ట్రాన్స్ పోర్ట్ మాత్రమే కాకుండా ఎవరైతే వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తూ చనిపోయారో వారి కుటుంబాలకు కూడా సాయం చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన వందలాది రిక్వెస్ట్ లకు కూడా స్పందించి తనకు తోచిన సాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది మంది పేద విద్యార్థులను చదివించేందుకు ఆయన రెడీ అయ్యాడు. దేశ వ్యాప్తంగా ఆయన సేవ కార్యక్రమాలు విస్తరించడంతో ఆయన్ను రియల్ హీరో అంటూ అంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

సుదీర్ఘ విరామం తర్వాత ఆయన హైదరాబాద్ కు అల్లుడు అదుర్స్ షూటింగ్ కోసం వచ్చాడు. హైదరాబాద్ లో సోనూ సూద్ ల్యాండ్ అయిన సందర్బంగా అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అయ్యాడు. ఆ రియల్ హీరోకు స్వాగతం పలికేందుకు గాను హైదరాబాద్ విమానాశ్రయంకు జనాలు కిక్కిరిసి పోయారు.

కాగా, అల్లుడు అదుర్స్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సోనూ.. సెట్‌లోకి వస్తుండగానే చప్పట్లతో ఆహ్వానించారు. అనంతరం సోనూసూద్ ను నటుడు ప్రకాష్ రాజ్ సన్మానించారు. అనంతరం సోనూను శాలువాతో సన్మానించారు ప్రకాశ్‌ రాజ్. సోనూ చేస్తున్న మంచి పనులకు ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీతో మిగతా నటీనటులు.. సోనూ సూద్‌ రియల్‌ హీరో అంటూ ప్రశంసించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అతి త్వరలోనే అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ లో సోనూ సూద్ పాల్గొనబోతున్నాడు. సోనూ సూద్ ఈ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసలు అందుకుంటున్న సోనూ సూద్ నటిస్తున్న కారణంగా అల్లుడు అదుర్స్ సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని తప్పకుండా విడుదల సమయంలో సోనూసూద్ క్రేజ్ సినిమాకు మైలేజ్ ను తెచ్చి పెడుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.