డ్రైనేజీ సమస్య పరిష్కరించండి మహాప్రభు

  • మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, రామకృష్ణ, బంగార్రాజు

అరకు నియోజకవర్గం, మాడగడ పంచాయతీ పరిధిలో గల బోడుగూడ గ్రామంలో తక్షణమే డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలి జనసేన మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా అల్లంగి, రామకృష్ణ, బంగార్రాజు, కొర్ర జల్లెడి సంతోష్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ బృందంగా ఏర్పడి బోడుగూడ గ్రామంలో పర్యటించి, ముందుగాను గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య నెలకొందని, ఇళ్ల పట్టాలిచ్చి నేటి వరకు ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వలేదని జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన జనసేన పార్టీ మాజీ ఎంపిటి సాయిబాబా దురియా గొప్పలు చెప్పుకుంటున్న ఈ వైయస్సార్ ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వకుండా ఇళ్ల పట్టాలకి పరిమితం చేసి చేతులు దులుపుకుంటున్న ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్ రెడ్డి నాయకత్వంలో మేము చూస్తున్నామని తెలిపారు. గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం డ్రైనేజీ మరియు కనీస సదుపాయం కల్పించలేని పరిస్థితిలో నెలకొందని ప్రభుత్వంఫై ఎదవ చేసి మాట్లాడారు. తక్షణమే డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తీసుకెళ్లారు. కావున రాష్ట్రంలో నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జనసేన పార్టీకి 2024లో పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జనసేన బృందం డ్రైనేజీ లేక నీటి నిల్వతో ఉన్న కాలువను పరిశీలించారు. జనసేన పార్టీ జనసైనికులు కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.