మంచినీటి సమస్యను పరిష్కరించండి.. జనసేన డిమాండ్

కాకినాడ రూరల్: కరప మండలం, పేపకాయల పాలెం గ్రామం మరియు కరప మండల వ్యాప్తంగా త్రాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరింది. కరప మండలం కరప గ్రామ శివారు పేపకాయల పాలెం, గొర్రిపూడి, గురజనాపల్లి, ఉప్పలంక ఒంటి గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. త్రాగునీరు పది రోజులకు ఒకసారి మాత్రమే అందుతుంది. సరైన త్రాగునీరు లేక టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు సోకి హాస్పటల్ పాలవుతున్నారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ జనసేన పార్టీ తరఫున కరప మండల ప్రజల తరఫున గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం ఇచ్చి వారిని కోరడం జరిగింది.