జనసైనికుల ఆత్మీయ కలయిక

కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం జనసేన నాయకులు రాజశేఖర్ మరియు నిస్వార్థ జనసైనికుల ఆత్మీయ కలయిక అనంతరం ప్రముఖ కాపు జేఏసి దక్షిణ భారత నాయకులు దాసరి రాముని మరియు అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠని జనసేన శ్రేణులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు దాసరి రాము మాట్లాడుతూ అనునిత్యం పేద, బడుగుబలహీన వర్గాల కోసం పరితపించే జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకొని పీడిత వర్గాలకు రాజ్యాధికారం అందించేలా కాపు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యమత్యంతో కృషి చేయాలని వ్యాఖ్యానించారు. జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలంటే కచ్చితంగా నిస్వార్థ నాయకుడైన పవన్ కళ్యాణ్ ని 2024లో ముఖ్యమంత్రిగా చేసుకుని తీరాల్సిందే అని, అంతవరకూ నిస్వార్థ జనసైనికులు అందరూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.