ఓటిటిలో శ్రీ ముఖి సినిమా

బుల్లితెరపై భారీ క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి  బిగ్ బాస్ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసిoది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉండే శ్రీ ముఖి గతంలో జులాయి, లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్, నేను శైలజ, సావిత్రి, జెంటిల్మెన్ వంటి సినిమాల్లో నటించిన శ్రీముఖి.. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసింది.

తాజాగా  శ్రీముఖి నటించిన ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమా  సైతం విడుదలకు సిద్ధమైంది. ఐతే ప్రస్తుతం థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అన్ని చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఇట్స్ టైమ్ టు పార్టీ సినిమాను గౌతమ్ ఈవియస్ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 11 న ఈ చిత్రం OTT ప్లాట్‌ఫాంపై విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఏదైనా ఓటిటి ప్లాట్‌ఫామ్‌తో డీల్ ఓకే ఐతే.. ఆ తర్వాత ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.