మజ్జివలస గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి తీర్థ మహోత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం బూర్జ పంచాయితీ మజ్జివలస గ్రామంలో హనుమాన్ జయంతి మజ్జివలస గ్రామంలో అంగవైభగంగా ఆంజనేయ స్వామి తీర్థం జరుపుకున్నారు. మజ్జి కృష్ణ సోంబాయి పరుశురాం బుద్ధు అద్వర్యంలో శనివారం జనసేన పార్టీ నాయకులు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు అరకు పార్లమెంట్ వర్కింగ్ సభ్యులు కొనెడి లక్ష్మణ్ రావు పార్లమెంట్ ఎక్సక్యూటివ్ మెంబర్ శ్రీనివాస రెడ్డి జనసేనపార్టీ సీనియర్ నాయకుడు బంగారు రామదాసు కొనెడి చిన్న బాబు సంతోష్ కుమార్ గ్రామంలో పర్యటించి మొదట ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం జనసేనపార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాదాల శ్రీరాములు, లక్ష్మణ్ రావు, రెడ్డి రామదాసు మాట్లాడుతూ గ్రామస్థాయిలో జనసేనపార్టీ భలోపేతమే లక్ష్యంగా గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన గ్రామాల్లో జనసేనపార్టీలో భారీగా చేరికలుంటాయి మన్యంలో అన్ని పార్టీల నుంచి జనసేనపార్టీకి సంపూర్ణంగా మద్ధతు లభిస్తుంది ఏ గ్రామంలో అడుగు పెట్టిన పండగ వాతావరణంలా జనసేనపార్టీ నాయకులను ఆహ్వానిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివారిస్తుంటే ప్రజలు ఏజెన్సీలో జనసేనపార్టీ పుంజుకుంటుందని గ్రామస్థాయి రైతులు విద్యార్థులు మేధావులు ఉద్యోగులు యువతి యువకులు అందరూ జనసేనపార్టీ వైపే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మహేష్ కృష్ణ విజయ్ కుమార్ రాంప్రసాద్ కొండబాబు కార్యకర్తలు జనసైనికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.