అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించిన పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని అన్యాయాన్ని ఎదిరించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం పోలీస్ స్టేషన్ సెంటర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన పోరాటాన్ని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొంతు లచ్చరావు, పల్నాటి మధుబాబు, మాగపు ప్రదీప్, బొంతు నాగు, పిల్లా వీరబాబు, పిల్లా రమణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.