కనిగిరిలో జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న వరికూటి

కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ సారథ్యంలో వెలిగండ్ల మండలం అధ్యక్షుడు తాతపూడి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వెలిగండ్ల మండలంలో వెలిగండ్ల, అగ్రహారం, పందువా, గుమ్మల కర్ర, రాళ్లపల్లి, నాగిరెడ్డి పల్లి, చోడవరం, కొట్టాలపల్లి, మరపగుంట్ల, తదివారిపల్లి జనసేన కార్యకర్తలని కలసి పార్టీ బలోపేతం గురించి చర్చించి తగుసూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరినాథ్, వలి, ఇమార్న్ బాషా, ఆంజనేయులు, బ్రహ్మాజి, దాసరి అయ్యప్ప మరియు జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.