తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలను అరికట్టాలి: తిరుపతి జనసేన

  • శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న అధికార పార్టీ నాయకులు

తిరుపతి, శ్రీవారి సన్నిధిలో అధికార పార్టీ ప్రచారం చేస్తూ ఇంటింటికి స్టిక్కర్లు అతికించడం ఇలాంటి సంఘటనలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ఏడి బిల్డింగ్ నందు ఈ జీవో మనోహర్ ని కలిసి వైసిపి అంటించిన స్టిక్కర్లను వెంటనే తొలగించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుమల పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాలని మంగళవారం తిరుపతి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు కీర్తన, రాజేష్ యాదవ్, లక్ష్మి , కొండ రాజమోహన్, మునస్వామి, రాజేష్ ఆచారి, సుమన్, కిశోర్, మనోజ్, హేమంత్, సాయిదేవ్, వినోద్, దుర్గ, చందన, పురుషోత్తం, బాలులతో కలిసి వినతి పత్రంను అందజేశారు.