ప్రతిపక్షాలను రెచ్చగొట్టే చర్యలను ఇకనైనా విరమించుకోండి: గాదె

గుంటూరు: జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వవహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రసంగించారు. గాదె మాట్లాడుతూ.. రాజకీయ నాయకులుగా ఉంటూ తాము చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టాల్సిన నాయకులు కులాల ప్రస్తావన తీసుకొచ్చి, కులాల మధ్యన చిచ్చు పెట్టె విధంగా మాట్లాడడం సిగ్గు చేటు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని వారు ఆడిందే ఆట అన్నట్టుగా ఈ నాయకులు ప్రవర్తిస్తుంటే అధికారులు వారి చేతిలో కీలు బొమ్మల్లా మారుతున్నారు. దానికి ఉదాహరణే విడుదలవుతున్న జీవోలు. గత వారం రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అటు పక్క బాబాయ్ మర్డర్ కేసు మీదకి చుట్టుకుంటుంది, ఇటు పక్క ఎటువంటి తలా తోక లేని, ఏ మాత్రం ఉపయోగపడని ఇళ్ల స్థలాల కాగితాలను ఇచ్చి ప్రజలని మోసం చేస్తున్నారు. గతంలో బ్యానర్ అనేది ఉండకూడదు. రద్దు చేసేస్తున్నాం అని మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి గారు నేడు సోషల్ మీడియా కన్వీనర్ తో ప్రతిపక్ష నాయకుల మీద వ్యంగ్యంగా బొమ్మలు వేయించి ప్రతి ఊర్లో బ్యానర్ లు ఏర్పాటు చేసే పనులు చేస్తున్నారు. ఈ చర్యలు ఒక ప్రభుత్వం చెయ్యడం సిగ్గు చేటు. ఇలా ప్రజల మధ్యలో విద్వేషాలు రేకెత్తి ఆయన మీదకి చుట్టుకోబోతున్న వివేకానంద రెడ్డి గారు కేసు గురించి, అతి-గతి లేని ఇళ్ల పట్టాల గురించి ప్రజలు మర్చిపోతారు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇన్ని దారుణాలు చేస్తున్నారు. రాజీకీయాల్లోకి వ్యాపారస్తులు వస్తే, వారికి అధికారం కట్టబెడితే ఎంత అద్వానంగా ఉంటుందో, జగన్ రెడ్డి గారి పాలనే ఉదాహరణ. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ బ్యానర్ లు ఉండాలని ఆదేశాలు ఇవ్వడం, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి మండలానికి, గ్రామానికి కబురు పంపుతున్నారు. ముఖ్యమంత్రి గారి తాడేపల్లి నివాసం చుట్టుపక్కలలోనే ఈ బ్యానర్లను మనం గమించచ్చు. గురజాల, పిడుగురాళ్ల నియోజకవర్గాల్లో కూడా బ్యానర్లు వేస్తే స్థానికంగా ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు అక్కడ పొలిసు వారికీ కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోతే వారు నిరసన తెలిపారు. దానికి వారిని లాఠీ ఛార్జ్ చేసి బలవంతంగా పొలిసు స్టేషన్ కి తరలించారు. మాచర్లలో కూడా ఇదే తరహాలో బ్యానర్లు పెడుతున్నారు. రేపు అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు డైవర్షన్ రాజకీయాలు చేస్తే ప్రజలు డైవర్ట్ అవుతారు అనుకుంటే మూర్ఖత్వమే.. ప్రజలు ఏమి డైవర్ట్ అవ్వరు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. వైజాగ్ లో కూడా జనసేన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసారు. ఇలా అరెస్టులు చేసి మాపై ఎదో ముద్ర వెయ్యాలి అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉంది. ఇప్పటికైనా ఈ సిగ్గుమాలిన చర్యలను ఉన్నపళంగా ఆపకపోతే ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. మీ వ్యక్తిగత విషయాలను కూడా ఇలాగే బ్యానర్ ల రూపంలో బయట పెట్టాల్సి వస్తుంది. మేము ఇప్పటికీ చాల సంయమనంతో వ్యవహరిస్తున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టే చర్యలను ఇకనైనా విరమించుకోండి అని హెచ్చరించారు. పత్రికా సమావేశంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లికా, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మ, అల్లహరి, నెల్లూరు రాజేష్, మధులాల్ పాల్గొన్నారు.