శంకుపర్తి గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: జనసేన మురళి

అనంతగిరి: గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని జనసేన మండల అధ్యక్షులు సిహెచ్ మురళి పేర్కొన్నారు. గురువారం జనసేన మురళి విలేకరులతో మాట్లాడుతూ.. సంకుపర్తి రెవెన్యూ పరిధిలో కోట్లాది రూపాయల భూములు ఎవరు అమ్మారు? ఎవరు కొనుక్కున్నారు? అన్నది మిస్టరీగా ఉంది. నిజమైన రైతులకు మాత్రం ఉండడానికి ఇల్లు లేదు. తాగడానికి నీరు లేదు. వీరు బ్యాంకు బ్యాలెన్స్ లో లక్షలు కూడా కనిపించడం లేదు. కానీ వీరి డాక్యుమెంటేషన్లు చూస్తే లక్షల నుండి కోట్లాది రూపాయలు మారినట్లు తెలుస్తుంది. ఈ డబ్బులు ఎక్కడ చేరాయి అన్నది మనం తెలుసుకోవలసిన అవసరముంది. నిజంగా భూమిలో ఉన్న రైతులు ఇప్పటికే సాగులో ఉంటూ వాడు పేదరికం అనుభవిస్తూనే ఉన్నారు రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూసి చూసి లబోదిబోమంటున్న ఆదివాసి గిరిజనులు సర్వే నెంబర్ 14/3 5-1, 9-1 19-2, 11-1, 55.53-1 అలాగే సర్వే నెంబర్ 28కు చెందిన సన్యాసి కుమారుడు సుర్ర తమ్మయ్య చనిపోయారు. గాని ఇప్పటికి జీవించి ఉన్నాడని ధ్రువీకరించి, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. రెవిన్యూ డిపార్ట్మెంట్ సరైన రీతిలో దర్యాప్తు చేస్తే నిజాలు అన్ని బయటికి వస్తాయి కానీ స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు రెవిన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. 220 ఎకరాల భూమిని ఎవరమ్మారు ఈ భూమి యొక్క డబ్బులు ఎవరికి చేరాయి, ఎలా చేరాయి అన్నది కూడా దర్యాప్తులో తేలాలి. కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నది ఎవరు. సంకుపర్తి భూమి నుండి అమాయక గిరిజనులు మాత్రం ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక వేసుకోవడానికి చెప్పులు లేక ఉన్నారు. వీరి భూములు మాత్రం కోట్లాది రూపాయలు వ్యాపారం చేసి సంపాదించింది ఎవరు వీరి అమాయకత్వాన్ని తెలుసుకొని ఎవరు డబ్బులు తీసుకున్నారు. ఈ గిరిజనులు మాత్రం చెప్తుంది ఇక్కడ వచ్చింది ఇద్దరు వ్యక్తులు అని చెప్తున్నారు ఒకటి కుంభ రవిబాబు రెండు పేరు వేల పూరి మారుతి సంద్ర మోహన్ వీరు తప్ప ఈ గిరిజనులకి ఎవరూ తెలియదు గాని కోట్లాది రూపాయలు విరి అస్తిని ఎవరి దోచుకున్నారు అన్నది దర్యాప్తులోనే తేలాలి. దయాప్తులో తేలినప్పుడే నిజమైన గిరిజనులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ వెళ్లిన వారిని అడ్డగించడం ఆదివాసీ బిడ్డల వారి కష్టాలను చెప్పకుండా వారిని బెదిరిస్తుంది ఎవరు? రెవిన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు నిజమైన దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకోలేక పోతుంది. ఒక్క సెంటు భూమి కూడా లేకుండా ఏ రైతు అమ్మడు. ఎవరి భూమి ఎక్కడ ఉందో అన్నది కూడా కొన్నవాడు చెప్పలేని స్థితిలో ఉన్నాడు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన శిక్ష తీసుకోవాలని గ్రామస్తులు, జనసేన నాయకుడైన మురళిని తెలియజేసారు.