‘మళ్లీ మొదలైంది’ నుంచి సుహాసిని పోస్టర్ రిలీజ్!

సుమంత్ – నైనా గంగూలి జంటగా ‘మళ్లీ మొదలైంది’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో దర్శకుడిగా కీర్తి కుమార్ పరిచయమవుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడాకులు అనేవి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఒకసారి ఆ ఆలోచన వచ్చిన తరువాత భార్యాభర్తల ప్రవర్తన ఎలా మారిపోతుంది? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ తోనే ఈ విషయాన్ని చెప్పడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారు. అందువలన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు సెకండ్ లుక్ గా సుహాసిని పోస్టర్ ను రిలీజ్ చేశారు. సుహాసిని లుక్ ను .. ఆమె పాత్రను .. ఆమె వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు. వెన్నెల కిషోర్ .. పోసాని కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేయనున్నారు.