Afghanistan లో ఆత్మాహుతి దాడి – 50 మందికి పైగా మృతి

ఆఫ్గనిస్తాన్‌లోని కుందూస్‌ నగరంలోని షియా మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది.  ఈ రక్తపాత దాడిలో   50 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఈ దాడి సంభవించింది. తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొద్దిరోజులుగా షియాలకు ఐసిస్‌ ఖొరాసాన్‌ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.