సీబీఐ విచారణకు చేరిన సుశాంత్‌ మృతి కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు  సుశాంత్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకీ అప్పగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణలో కేసులోని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.