తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో భారిచేరికలు

  • జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ మరియు ఉపాధ్యక్షులు

తాడేపల్లిగూడెం: సుంకర యేసు కుమార్ ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తోట గోపి సమక్షంలో పరిమెళ్ళ గ్రామం నుండి వైఎస్ఆర్ సిపి గ్రామ అధ్యక్షుడు కడియం రాంబాబు మరియు గ్రామ 10వ వార్డు మెంబర్ ఆకివీటి ముసలయ్య, మాజీ వార్డ్ మెంబర్లు తోట సత్యనారాయణ, జల్ది పెద్దిరాజు మరియు హరిజన పేట అంబేద్కర్ యూత్ నుండి 30 మంది యువకులు మరియు గ్రామంలో వైఎస్ఆర్ సీపి పార్టీ నుండి 100 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవా కార్యక్రమాలు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిమెళ్ళ గ్రామం స్వచ్ఛమైన పల్లెటూరు ఈ పల్లెటూరిని సరైన త్రాగునీరు లేక డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక అనారోగ్యానికి పరిమెళ్ల గ్రామ ప్రజలు గురవుతున్నారు. త్రాగునీరు సమస్య, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయడం మానేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సిద్ధం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీరు దేనికి సిద్ధమని అని నేను అడుగుతున్నాను, ఈ నియోజక వర్గంలో సరైన రహదారి వేయలేదని మీరు సిద్ధమా ఈ నియోజకవర్గంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ సరిచేయని మీరు దేనికి సిద్ధమని అడుగుతున్నా, తాడేపల్లిగూడెంలో ఒక ఇల్లు కట్టాలంటే మీరు కమిషన్ తీసుకున్నందుకు సిద్ధమా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలంటే దానికి కమిషన్ తీసుకుంటున్నందుకు సిద్ధమా సిద్ధం అనే మాట మీ నోట రావడానికి మీకు సిగ్గుండాలి అని అడుగుతున్నాను. మీరు సిద్ధం కాదు రాష్ట్ర ప్రజలు వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఉపముఖ్యమంత్రి కమిషన్ను కొట్టు సత్యనారాయణ ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను, ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు. లిక్కర్ అమ్ముకుంటున్నారు, ఇవి చాలక చెత్త పన్ను కేటాక్స్ విధించి ప్రజలను నాశనం చేస్తున్నారు. మీరు ఎన్ని సభలకు సిద్ధమైన ప్రజలు మాత్రం మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాననీ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.