తాడేపల్లిగూడెం బహిరంగ సభను విజయవంతం చేయాలి: దొడ్డిగర్ల సువర్ణరాజు

తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు సంబందించి మంగళవారం గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో మరియు నాలుగు మండలాల అధ్యక్షులు పోల్నాటి రాజేంద్ర, కాట్నం గణేష్, దాకారపు నరసింహామూర్తి, చోడసాని బాపిరాజు సమక్షంలో మీడియా సమావేశం గోపాలపురం మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సువర్ణరాజు మాట్లాడుతూ సభ ప్రాంగణంలో స్టేజ్ మీద 500 మంది నాయుకులు మధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశమం చేసిన జగన్ రెడ్డి అలియాస్ సైకో రెడ్డి ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రక్షాసానందం పొందుతున్న ఈ దుర్మార్గుడున్ని గద్దె దించేలా ప్రసంగం ఉంటుందన్ని తెలియచేస్తూ ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హోదా విషయంలో పోలవరం విషయంలో, స్టీల్ ప్లాంట్ విషయంలో, నిరుద్యోగుల యువకులకు ఉపాధి కల్పించే విషయంలో, మద్యపానం నిషేధం విషయంలో, సిపిఎస్ రద్దు విషయంలో, రోడ్ల నిర్మాణం విషయంలో, పేద ప్రజల వర్గాల వారికీ విద్యని దూరం చేసే విషయంలో రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెత్తిన విషయంలో, ప్రజల డబ్బుని వేల కోట్ల రూపాయిల వెచ్చించి అయన ప్రకటనలకి, అయన ప్రయాణాలకి, తుగ్లక్ విధానాలను గురుంచి, దళితుల హత్యలు గురుంచి,దళిత మహిళలకు అన్యాయం జరిగిన విషయాలు గురుంచి,ప్రజలకు తెలియజేయలన్న ఉద్దేశంతోటి, మొట్టమొదటి సారిగా తాడేపల్లిగూడెంలో జరగబోయే ఈ బహిరంగ సమావేశంలో తెలియచేయాలనీ ఇరు పార్టీ శ్రేణులు ద్విగ్విజయంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు సంబందించినటువంటి నాయకులు పోసిన గణపతి, రాంలీల, సూర్యభగవాన్, శివ నాగ ప్రసాద్, నాని, జెకె శ్రీను, ఉమామహేష్, ఫణీంద్ర, నాగేంద్ర, మల్లేశ్వరరావు, వేణు, కృష్ణబాబు, తిలక్, బాబీ, వీరమళ్ళ, శ్రీను,మాదేపల్లి నాగేశ్వరావు, పాల్గొన్నారు.