నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తంబళ్లపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా టిడిపి జనసేన పార్టీలతో కలిసి కార్యక్రమాల నిర్వహణకై నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తంబళ్ళపల్లి రమాదేవిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నందిగామ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమించడం చాలా మంచిదని నందిగామ నియోజకవర్గంలో ఇకనుండి ఏ కార్యక్రమం జరిగిన తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో ప్రతి జనసేన కార్యకర్త జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నందిగామ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమించిన తంబళ్లపల్లి రమాదేవిని ప్రతి జనసేన కార్యకర్త నాయకులు ముందుండి నడిపిస్తారని జనసేన కార్యకర్తలు నాయకులు తంబాళ్ళ పల్లి రమాదేవికి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమించబడిన తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యక్రమాల నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నన్ను నియమించినందుకు అధినేత పవన్ కళ్యాణ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.