అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ రోళ్ళ భాస్కర్ కి సన్మానం చేసిన టి.సి.వరుణ్

అనంతపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా 1615 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నగర ప్రధాన కార్యదర్శి రోళ్ళ భాస్కర్ని అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఘనంగా సన్మానించిన అనంతరం టి.సి.వరుణ్ మాట్లాడుతూ రొళ్ళ భాస్కర్ విజయం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. అనంతరం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోళ్ళ భాస్కర్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన వారికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర్ కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.