రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనంతో “టీ” జనసేన

మదనపల్లె నియోజకవర్గంలో మూడు రోడ్లు క్రాస్ బాసినికొండ క్రాస్ లో జనంతో “టీ” జనసేన కార్యక్రమంలో భాగంగా గాజు గ్లాసు గుర్తు విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి జనంతో మమేకం కావడం, ప్రజా సమస్యలు గుర్తించడం, గాజు గ్లాసు గుర్తు విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడమే లక్ష్యం కోసమే జనసేన కార్యక్రమంలో భాగంగా జనంతో “టీ” జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు బుధవారం టీ స్టాల్ వద్ద ప్రజలతో కలిసి టీ సేవిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.‌ జనంతో మమేకమై జనసేన పార్టీ గుర్తు గాజు‌గ్లాసు ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి జనంతో టీ జనసేన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు తెలుకునే జనంతో ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజా సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం అసమర్థ పాలనను ప్రజలు గ్రహించాలన్నారు.దమ్మున్న నాయకుడు అని చెప్పుకునే జగన్ రెడ్డి నిన్న తన చెల్లెలు షర్మిలను తెలంగాణా ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కేసీఆర్ పై ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉన్న ధైర్యం కేవలం తెలంగాణ లో ఉన్న తన ఆస్తులు కాపాడుకోవడం కోసం దేవుడు ఉన్నాడు చూస్తాడు అని చెప్పే జగన్ ఇప్పుడు దేవుడు మొత్తం Yశ్ కుటుంబం మొత్తము వై.ఎస్ షర్మిల, వై.ఎస్ అవినాష్ రెడ్డి వై.ఎస్ భాస్కర రెడ్డి త్వరలో పెద్ద చేపలని కూడా చెంచల్ గూడ జైలు పిలుస్తోంద్ని, ప్రజలు మంచి చేసే పార్టీ జనసేన పార్టీకి రాష్ట్రంలోని ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి సురేంద్ర, సనఉల్లా గజ్జెల రెడ్డప్ప నాయకులు గ్రానైట్ బాబు, జగదీశ్ రెడ్డఅమ్మ కళ్యాణ్ నాగరాజు, శంకర, జనార్ధన్ సాయి కుమార్, చిరంజీవి లక్ష్మిపతి తదిరులు పాల్గొన్నారు.