గంగారపు ఆధ్వర్యంలో జనంతో “టీ” జనసేన

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి మండలంలోని ఎన్ వి ఆర్ లేఔట్ లో మున్సిపల్ పార్క్ నందు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి జనంతో టీ జనసేన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ పాత మిత్రులు, హితులు, సన్నిహితులు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోనికి తీసుకుని వెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో కౌలు రైతులను ఆదుకొన్న విధానం గురించి ప్రస్థావించడం జరిగింది. గ్రౌండ్స్ నందు ప్లేయర్స్, టీచర్స్, అడ్వకేట్స్, ఎంప్లాయిస్ వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే వారికి వాటర్ బాటిల్, టీ ఇచ్చి జనసేన పార్టీ సిద్దాంతాలను, గాజు గ్లాసు గుర్తు ను విస్తృతంగా తీసుకుపోతుంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, కుమార్, నవాజ్, జనార్దన్, జవిలి మోహన కృష్ణ, నాగ, అర్జున, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.