జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన టీ టైమ్ వ్యవస్థాపకులు

తూర్పుగోదావరి జిల్లా, కడియం ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ కు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోవార్ పాల్గొన్నారు. ఉదయ శ్రీనివాస్ టీ టైమ్ అవుట్ బెట్ల వ్యవస్థాపకులుగా సుపరిచితులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఉదయ శ్రీనివాస్ గోదావరి జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త, కాశీ నుంచి కన్యాకుమారి వరకు 17 రాష్ట్రాల్లో 3 వేల దేశీ టీ టైమ్ అవుట్ లెట్లు స్థాపించిన వ్యక్తి. ఈ అవుట్లెట్ల ద్వారా సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. 800 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేశారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది. ఉదయ్ శ్రీనివాస్ ను మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు.