కృష్ణాజిల్లా జనసేన ఆధ్వర్యంలో టీం పిడికిలి గోడప్రతుల ఆవిష్కరణ

కృష్ణాజిల్లా: జనసేన పార్టీ కృష్ణాజిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ చేతుల మీదుగా టీం పిడికిలి పి2 గోడ పత్రిక పోస్టర్లును విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో.. కౌలురైతుల బలవన్మారణాల విషయం, 3000 మందికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయా రైతుల వివరాలను సేకరించి వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందక పోవటంతో తనవంతుగా 30 కోట్ల రూపాయలుతో సహాయం చేయాలని చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయలు స్వయంగా అందజేయడం.. వారి పిల్లల చదువులుకు కూడా సహకరిస్తారని చెప్పి ఆయా కుటుంబాల్లో దైర్యం నింపడం అనేది చాలా గొప్ప విషయం.. ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఎన్ఆర్ఐ జన సైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి వారిచే ప్రచురించబడిన గోడ పత్రిక పి2 పోస్టర్లను జిల్లా కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం బంద్రెడ్డి రవి, శ్రీనివాసరావు, లోకేష్, శివరామకృష్ణ, సురేష్, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.