నీ అమితమైన ప్రేమకు థ్యాంక్యు.. హ్యాపీ బర్త్‌డే అమ్మ

మెగాస్టార్ చిరంజీవి సతీమణి  సురేఖ ఇవాళ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా హీరోలు ఆమెకు అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తనయుడు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తల్లికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియాలో అమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేసిన రామ్ చరణ్.. భావోద్వేగ కామెంట్ పెట్టారు. ”నీ అమితమైన ప్రేమకు థ్యాంక్యు. హ్యాపీ బర్త్‌డే అమ్మ” అని రామ్ చరణ్, తన తల్లికి విషెస్ చెప్పారు. ఆ పోస్ట్‌కి మెగాభిమానులు కూడా స్పందిస్తున్నారు. సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వారు కామెంట్లు పెడుతున్నారు.