బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు

తిరుపతి సిటీ: బీసీలకు డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా.. తిరుపతిలో టీడిపి, జనసేన నేతలు బాలాజీ కాలనీ వద్ద గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలతో నివాళులర్పించారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీల అభ్యున్నతికి పాటుపడేది ఒక్క జనసేన, టీడిపి పార్టీలేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నగర్ అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, కొండా రాజమోహన్, ముక్కు సత్యవంతుడు, దినేష్ జైన్, హిమవంత్, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కిషోర్, వంశీ, మనోజ్, వినోద్, మునస్వామి, పురుషోత్తం, రవికుమార్ తదితరులు.. టిడిపి ఇన్చార్జ్ సుగుణమ్మ, పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర, జిల్లా, నగర మహిళ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.