గొల్లాది గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని.. జనసేన నిరాహార దీక్ష

బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, గొల్లాది గ్రామంలో తక్షణమే బ్రిడ్జి నిర్మించాలని జనసేన పార్టీ నిరాహార దీక్ష చేయడం జరిగింది.

నియోజకవర్గ ఇన్చార్జి గిరాడ అప్పలస్వామి మాట్లాడుతూ గత వారం రోజులుగా బ్రిడ్జి నిర్మాణం కొరకు అన్ని మీడియాల్లో వెల్లడిస్తూ తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరడం జరిగింది.. ఈ నదిపై బ్రిడ్జి లేకపోవడం వల్ల 12 గ్రామాల ప్రజలు పెద్దవాళ్లు, స్కూల్ కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే కూలీలు, పొలానికి వెళ్ళే రైతులు, చాలా ఇబ్బందులు పడుతున్నారు…ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు గతంలో 7,90,000,00 కోట్ల రూపాయలుఆమోదించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నిర్లక్ష్యం వహించారు. ఈ సారి ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం అయినా సరే తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరడం జరిగింది.

నియోజకవర్గం నాయకులు గంగాధర్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే గారు గోల్లాది గ్రామంలో మీరు నిర్మించబోయే గడపగడపకు ప్రోగామ్ లో గ్రామ ప్రజలు నిలదీయడానికి రెడీగా ఉన్నారు.. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బాడ్ంగిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు గొల్లది బ్రిడ్జి నిర్మాణం తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మూడుసంవత్సరాలు గడిచినా ఇంకా దానిమీద చలనం లేదు.. కావున తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేయాలని.. మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని మీకు గుర్తు చేస్తూ మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగిందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంచనా గంగాధర్, దివ్య, లంక రమేష్, అడబాల నాగు, బుడి రాజా, పల్లెం రాజా, పొట్నూరు జనార్ధన్, పైల హరి, పిట్టల కిరణ్, చంద్రమౌళి, శివ, సత్య జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.