ప్రజలే జెండా ఎగరేసే రోజు రావాలి: సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండల కేంద్రం, సంత గేటు ముస్లిం కాలనీలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి హాజరయ్యారు. స్రవంతి రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోని అందజేస్తూ, వారితో మమేకమవుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఇంటిని దర్శించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ అధికారులు జెండా ఎగరేస్తే అది ఆనవాయితీ, ప్రజలు జెండా ఎగరేస్తే అది పండగ అవుతుందని తెలిపారు. కానీ ప్రజలే జండా ఎగరేసే రోజు రావాలని, అది పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యపడుతుందని ఉద్ఘాటించారు. మూడు వేల మంది కౌలు రైతులకు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తూ, వారి కుటుంబంలో ఉన్న పిల్లల పోషణ బాధ్యత కూడా తీసుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన సేవలను కొనియాడారు. దేశ సమగ్రత, రాష్ట్ర సంక్షేమం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి జనసేన పార్టీని స్థాపించి, అడుగడుగునా ప్రజల హర్షద్వానాల మధ్య, విశిష్టమైన సేవలు అందిస్తున్న మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఇంటికి పంపాలని, రెండుసార్లు గెలిచి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించారని, ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల అభివృద్ధి చెందాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, ఆయన ద్వారా మాత్రమే సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని, గ్రామాలు పట్టణాలు నగరాలు సస్యశ్యామలమవుతుందని తెలియజేశారు. పూర్వపు ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అడుగుజాడల్లో నడుస్తూ, ఈమధ్య కాలంలోనే ఆయన స్మృతి స్మారక వనానికి ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మహానుభావులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ దేశం కోసం అసువులు బాసిన స్వాతంత్రోద్యమ నాయకుల అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, అందరం కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో లోని అంశాలను ప్రతి ఒక్కరికి వివరించారు. వైసీపీ పాలనలో నియోజక వర్గం అస్తవ్యస్తమయిందని, దీనిని సరి చేయాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందని, నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని కార్వేటి నగర్ మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు సెల్వి, ప్రధాన కార్యదర్శి రుద్ర, మండల బూత్ కన్వీనర్ మండి సురేష్ రెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు మహేంద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, వెదురు కుప్పం ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, ప్రధాన కార్యదర్శి బెనర్జీ, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతేశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ మరియు జనసైనికులు పాల్గొన్నారు.