పవన్ అన్న సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి

  • 109వ రోజు కొనసాగుతున్న పవన్ అన్న ప్రజా బాట

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 109వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నందలూరు మండలం లోని కుందా నెల్లూరు, కుమారానిపల్లి, గట్టుమీద పల్లె, చింతలకుంట లో ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అలాగే కుమారానిపల్లి లోని గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మా ఊరికే బస్సు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో మా ఊరికి వచ్చేటటువంటి బస్సును తీసేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుమారాని పల్లె నుండి గట్టుమీద పల్లికే వెళ్లే రహదారిని కూడా ఈ ప్రభుత్వం బాగు చేయలేదని అన్నారు. ఓట్ల కోసం వస్తారు కానీ ఈ ప్రభుత్వం వాళ్లు ఓట్లు వేయించుకున్న తర్వాత అసలు కంటికి కూడా కనబడరని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, వీరయ్య ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.