భవిష్యత్తు రాజకీయం జనసేన పార్టీదే: గాదె

తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. తాడికొండ మండలం అధ్యక్షులు గులకవరపు నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు మరియు పెద్దలు సహకారాలతో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ రావుని జిల్లా నాయకులను భారీగా బాణాసంచా పేల్చుకుంటూ అలాగే ద్విచక్ర వాహనాలతో ఊరేగిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… ముందుగా తాడికొండలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషించాల్సిన విషయమని అలాగే భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ కైవసం చేసుకునే విధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కలసి కట్టుగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలని కోరారు. రేపు శ్రీకాకుళంలో జరుగుతున్న “యువశక్తి” సభకు ఈ నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లాలని మన అధ్యక్షులు ఏ కార్యక్రమం తలపెట్టిన జనసైనికులుగా మనము అందరము ఆ కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా పయనించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, తడవర్తి కేశవ, త్రినాధ్, మండల అధ్యక్షులు ఏపూరి పూర్ణచంద్రరావు, రాచర్ల నాగబాబు, మదులాల్, భాష, సులేమాన్ నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.