కరోనా నిబంధనలన్నీ తొలగించడమే లక్ష్యం: బోరిస్

లండన్: ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో కరోనా నిబంధనలన్నీ తొలగించడమే తమ లక్ష్యమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కరోనా నిబంధనలను నాలుగు విడతల్లో తొలగించే రోడ్‌మ్యాప్‌ను సోమవారం నాడు ఆయన విడుదల చేశారు. దీని ప్రకారం, జూన్ 21 నాటికి ఇంగ్లండ్‌లో కరోనా నిబంధనలు పూర్తిగా తొలగిపోతాయి. మార్చి 8 నుంచి స్కూళ్లు తెరవడంతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 12 నాటికి నిత్యావసరాలు కాని వ్యాపారాలు కూడా తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తారట.