ఇంటిని జనసేన పార్టీ లోగోగా మార్చి పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమని తెలిపిన జనసైనికుడు

బొబ్బిలి నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామ శివకుమార్ గేదెల జనసైనికుడి నూతన గృహప్రవేశ ఆహ్వానం మేరకు హాజరు అయిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మరియు రాష్ట్ర ఐటీ విభాగం సభ్యులు గేదెల సతీష్, బొబ్బిలి జనసేన నాయకులు గంగాధర్ మరియు బొబ్బిలి జనసైనికులు పాల్గొన్నారు. బాబు పాలూరు మాట్లాడుతూ తన ఇంటిని జనసేన పార్టీ లోగోగా మార్చి పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమని ఈ విధంగా తెలుపుకున్నారు, ఇలాంటి వారే మన జనసేన పార్టీకి కావాలి, ఇలా ప్రభావితం చేసే వారే పార్టీకి కావాలి అని పేర్కొన్నారు. అలాగే జనసేన పార్టీ లోగో ముద్రించిన జనసైనికుడు మహేష్ కి చిరు సత్కారం చెయ్యడం జరిగింది.