జనసైనికులు నిబద్ధత గల కార్యకర్తలుగా మారాలి

జనసేనానిని నాయకుడిగా పూర్తి స్థాయిలో నమ్మి వచ్చిన సైనికుడికి ఉండవలసింది మొట్ట మొదటగా “పార్టీ నిర్ణయమే శిరోదార్యంగా” పనిచేయాలి ఇది కార్యకర్త మొదటి లక్షణం. ఇది మనం ఎప్పుడు అయితే అతిక్రమిస్తామో అప్పుడు మన ఓట్లు చీలిపోయి ప్రత్యర్ధులు బలబాడతారు.

ఎలా అంటే ? ఉదాహరణకి టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎంటిఆర్ ఆయన ఫోటో లేకుండా ఎన్నికలకు వెళ్లరు ఇప్పటికీ. అలాంటి నాయకుడిని వెన్నుపోటు పొడిచినా కూడా ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడుని సమర్దించుకుని ఆయన నాయకత్వాన్ని నిలపెట్టుకున్నారు.

ఇకపోతే వైసీపీ అవినీతి పునాదుల మీద కట్టిన రాజకీయ పార్టీ అయినా వైసీపీని కూడా ఆ పార్టీ కార్యకర్తలు గెలిపించుకున్నారు.

అలాంటిది ఒక నిస్వార్థమైన నిజాయతీ కలిగి అనునిత్యం ప్రజల మేలు కోసం పరితపించే అవినీతి మచ్చ లేని కొణిదెల పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోలేమా? ఖచ్చితంగా గెలిపించుకోగలం అది ఎప్పుడు అంటే మనం మన వ్యక్తిగత ఇగోలు, వ్యక్తిగత ఎజెండాలు ప్రక్కన పెట్టినపుడు మాత్రమే గెలుపు సాధ్యం, దానికి ఒక చిన్నఉదాహరణ ప్రత్యర్ధి పార్టీ నాయకులు నందిని చూపించి పంది అంటే ఆయా పార్టీల కార్యకర్తలు పందే అంటారు, అదే పందిని తర్వాత మళ్లీ నంది అన్నాకూడా ఎందుకు? ఏమిటి? అని మారు మాట్లాడకుండా వాళ్ళ నాయకుడి మాటను సమర్ధిస్తారు అది ఆ పార్టీ కార్యకర్తల నిబద్దత. అలాంటిది మనకోసం ఎన్నో త్యాగాలు చేసి తన విలాసవంతమైన వ్యక్తిగత జీవితాన్ని వదులుకుని నిలబడ్డ నాయకుడిని సమర్దించలేమా? ఖచ్చితంగా గెలిపించుకునే సత్తా మనలో ఉంది. ఎప్పుడంటే మనం మన వ్యక్తిగత ఇగొలని, వ్యక్తిగత ఎజెండాలని పూర్తిగా పక్కన పెట్టిసినప్పుడు మాత్రమే మనకి గెలుపు సాధ్యం.

ఒక్క క్షణం ఆలోచించండి.. వెన్నుపోటు పొడిచిన లేదా అవినీతి నాయకుల వాదనలు అబద్దమైన, పచ్చిమోసమైన ఆయా నాయకులు చేసే వాదనలను సమర్ధించే నిబద్దత కల్గిన కార్యకర్తలు ఉండబట్టే ఆయా పార్టీలు రాజ్యాధికారం చేజిక్కించుకో గలుగుతున్నాయి. కానీ…. జనసేన పార్టీ గత ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించలేకపోయింది ఎందుకు అంటే చేతిలో ఫోను, ఫోనులో మొబైల్ డేటా ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీని ఎలా నడపాలో అధినేతకే సలహాలు ఇచ్చే స్థాయిలో ఉంటారు, అదేపనిగా సోషల్ మీడియా దూరి సలహాలు ఇస్తూఉంటారు, కాదంటారా? అందుకే మనం మొట్టమొదటగా నిబద్దత గల కార్యకర్తగా మారాలి. మారడానికి సిద్ధమా?

ప్రతి ఒక్కరూ నిబద్దత గల కార్యకర్తగా మారాలి.
మారడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నట్లయితే ఈ జనబలాన్ని ఓట్ల బలంగా మార్చి తద్వారా సీట్ల రూపంలోకి మార్చడానికి ఉపయోగపడే ఒక ప్రణాళిక ఉడతాభక్తిగా సిద్దం చేయడం జరిగింది. అదేంటో ఎలాగో ఎంత కష్టమో ఏమీ చెయ్యాలో అనుకోవలసిన అవసరం కూడా లేదు. మనం చేయగలిగినది మన చేతుల్లో ఉన్నదైతే చేయగలరా..! అయితే మాతో కలిసి రండి…. మాతో చేతులు కలపండి.. అదేంటి అంటే, ప్రతి కార్యకర్త
ఇంటగెలిచి రచ్చ గెలవాలి అని పెద్దలు అన్నట్లుగా,
ముందుగా ప్రతి ఒక్క కార్యకర్త తమ కుటుంబ సభ్యులలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ప్రత్యర్ధి పార్టీలకి పడకుండా చూడాలి ఆలా చేస్తే రాజ్యాధికారం సులువే.. తక్కువలో తక్కువ ప్రతీ ఇంట్లో ఉన్న నాలుగు ఓట్లు వేయించగలమా లేదా? ఇది సులువు అయిన పని అవునా కాదా? సులువు అయిన పనే ఎలా అంటే మన జనసేన పార్టీకి సుమారు ఇరవై ఐదు లక్షల మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు కదా (మిస్డ్ కాల్ ద్వారా) 2500000X4 ఓట్లు అంటే ఒక కోటి ఓట్లు అవుతాయి మరి గడచిన ఎన్నికల్లో మన పార్టీ కి వచ్చిన ఓట్లు సుమారు ఇరవై లక్షలలోపు ఓట్లు దీనిని బట్టి మనకి అర్ధమయింది ఏమిటంటే 25 లక్షల సభ్యత్వాలు కలిగి ఉన్న మన పార్టీకి కనీసం సభ్యత్వం తీసుకున్న వారి ఓట్లు కూడా రాలేదు. పైన చెప్పినట్టు వ్యక్తిగత ఇగొలు మరియు వ్యక్తిగత ఎజెండాలా పర్యవసానమే గత ఎన్నికల ఫలితాలే ఉదాహరణ, దీన్ని అధిగమించడం కోసం రాజ్యాధికారం సాధించడం కోసం ప్రతి గ్రామంలో బలమైనసమూహాన్ని కూడగట్టుకోవడమే ఈ పల్లె పల్లెలో జనసేన జెండా అనే కార్యక్రమము. జనసైనికులారా రండి తరలిరండి ప్రజల్లోకి వెళ్దాము. రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెడదాం లక్షమంది సైనికుల తలలు తెగిపడ్డాగాని ఒక్కనాయకుడిని కాపాడుకుందాం జనసేన రాజ్యాధికారం సాధించుకుందాం.

పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి…
జై జనసేన… జై జై జనసేన.

మీ…✍🏻
సూర్యా నంద్యాల
జనసేన పార్టీ,
రాజోలు నియోజకవర్గం.

Nagababu: రాజకీయాలకి కావాలి ఓ సపరేట్ లుక్... పూర్తిగా పవన్ లా మారిన  నాగబాబును చూడండి!