అభిమానికి అండగా నిలిచిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు ఏదైనా ఆపద వచ్చినపుడు నేనున్నానంటూ అండగా నిలుస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కెరీర్‌లో చాలా మంది అభిమానులకు అవసరమైన సాయం చేసి.. గొప్ప మనసు చాటుకున్నాడు చిరు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వీరాభిమానికి అండగా నిలిచాడు చిరంజీవి. కడప జిల్లాలోని కదిరికి చెందిన పీ సురేశ్‌..అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు కడప జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పీ సురేశ్ ఆరోగ్యపరిస్థితి, ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న చిరు.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి వైద్య అవసరాల కోసం సురేశ్‌ ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయడంతోపాటు సురేశ్ కుటుంబానికి తాను బాసటగా నిలుస్తానని హామీనిచ్చినట్టు సమాచారం. సురేశ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు చిరంజీవి.