పొలమూరు గ్రామప్రజల ఆరోగ్యం దృష్ట్యా శ్రమదానం నిర్వహించిన జనసైనికులు

ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం, పొలమూరు గ్రామములో గ్రామప్రజల ఆరోగ్యం దృష్ట్యా శ్రమదానం నిర్వహించిన జనసైనికులు. గ్రామములో కోవిద్ సోకిన వారు అధికముగా ఉండటం, దోమలు అధికముగా విస్తరించడము వలన గ్రామస్థలు అందరు అనేక రకాల విష జ్వరాలకు లోనవుతున్నారని గ్రహించిన జనసైనికులు, గ్రామమంతా శానిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారంలో లేకపోయినా ప్రజల శ్రేయస్సు కొరకు పని చేసేది కేవలం జనసేన పార్టీ అని ప్రజలంతా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర మండల అధ్యక్షులు, ఇంచార్జి కోయ వెంకట కార్తీక్ మాట్లాడుతూ, చేగొండి సూర్యప్రకాష్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సమస్యలను గుర్తించి ప్రజలకు ఎల్లప్పుడూ చేరువలో ఉండాలని తద్వారా పార్టీని గ్రామగ్రామాన బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమములో పొలమూరు జనసేన ఎంపీటీసీ శ్రీమతి మాచిరెడ్డి నాగ దుర్గతో పాటు పలువురు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.