చలివేంద్రి గ్రామంలో ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం

  • ప్రజల్లోకి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సూపర్ సిక్స్ పథకాలు, ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోని

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసా వహిస్తూ.. జనసేన జిల్లా కార్యదర్శి బి.పి.నాయుడు, సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు జనసేన క్రియాశీల వాలంటీర్ మత్స పుండరికం జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు చలివేంద్రి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్. ఎల్. ఏ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గెలిపించాలని ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. గాజుగ్లాస్ గుర్తు కే మీ ఓటు, కమలం గుర్తుకే మీ ఓటు వేయాలని నినాదాలతో హోరెత్తించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రి పంచాయతీకి సంబందించిన టీడీపీ, జనసేన గ్రామ పంచాయతి నాయుకులు, కార్యకర్తలు, సైనికులు వీరఘట్టం మండలం జనసేన, బీజేపీ నాయుకులు పాల్గొన్నారు.