పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయింది: బొర్రా

  • జగనన్న ఇల్లు వైసీపీ నాయకుల జోబులు నింపుకోవడానికి మాత్రమే

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు గ్రామంలో జగనన్న ఇళ్లను సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆదివారం సందర్శించి నిరసన తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీల పరిస్థితిపై, #FailureOfJaganannaColony డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు జగనన్న ఇల్లు, సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు, తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. జగనన్న ఇల్లు అనేది నాయకుల జోబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని, ఇల్లు లేని పేదవాడి కల కలగానే మిగిలిపోయిందని, కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారని, వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఇప్పటికైనా సకాలంలో పేదలకు ఇల్లు అందించి వారి కలను సాకారం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ , నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, నకరికల్లు మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, సత్తనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, గుండ్లపల్లి గ్రామ అధ్యకులు నక్క వేంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మురళీ, కాసా రామకృష్ణ, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.