అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారించాలి

పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు గత ఐదురోజులు నుంచి తమ సమస్యల పట్ల కూర్చొని సమ్మెబాట నిర్వహిస్తు మా సమస్యను పరిష్కారించాలని దీక్ష చేస్తున్న సందర్భంగా వారి దీక్షకు సంఘీభావంగా పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త డా. వంపూరి గంగులయ్య ఆదేశాల మేరకు చింతపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జి బాబు, జిల్లా సమన్వయ కార్యదర్శి కిల్లో రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిల్లో రాజన్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, నాణ్యమైన అహార్రాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ, జనసేన పార్టీ తరపున పూర్తిగా అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు హామీ ఇచ్చి మాట తప్పం మడమ తిప్పమని చెప్పిన మాట మర్చిపోయారా అని కీళ్లో రాజన్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందున్న ఒక మాట ఎన్నికల తరవాత మరొక మాట చెప్పడం సరి కాదని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు వంతల రాజారావు, వంతల శేఖర్, హరి బాబు, రాజు, రవి, కార్యనిర్వహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్, కొర్ర భాను ప్రసాద్ పాల్గొన్నారు.