దేనికి నీ అవసరం ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి: గాదె

పొన్నూరు నియోజకవర్గ పెదకాకాని మండలంలో ఉన్న పొలాల్లో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గురువారం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవంగా ఈ టైంలో మనము ఇక్కడ నుంచునే పరిస్థితి కాదు, ఈ కాలంలో పొలాలలో దిగాలి అంటే మోకాళ్లు లోతులో నీరు, బురదతో నిండి ఉంటుంది. కానీ మేము అందరం కూడా ఈ పొలాలలో తిరిగినట్లు కాకుండా ఒక క్రీడా మైదానంలో ఎలాగైతే తిరిగుతారో అలాగా పోలాలలో తిరిగి వచ్చాము. రైతు యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత దయనీయస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఇక్కడ పంట వేసిన ఒక రైతుని అడగగా ఆ రైతు చెప్పిన విషయం నేను ఈ పంట కోసం 25 వేల రూపాయలు ఖర్చు చేశాను కానీ ప్రయోజనం లేదు ఎండిపోతుంది అంటున్నాడు. మనము ఈ రైతులను ఏ విధంగా ఓదార్చాలి..! ఆదుకోవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కుంటి సాకులు చెబుతూ మేము పెద్ద ఎత్తున రైతులను ఆదుకుంటున్నాము జగన్ రెడ్డి వచ్చాక రైతులు కోటీశ్వరులు అయ్యారు వారి దశా, దిశ మారిపోయింది అని చెప్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు. మాట్లాడితే బటన్ నొక్కటానికి వెళతాడు కానీ రైతులకు సంబంధించిన యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అని కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు నెలకు లక్షలలో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల నుంచి కింద స్థాయి లస్కర్లు కూడా కనిపించని పరిస్థితి. పంటకాలువ ఏదో, మురికి కాలువ ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అంత బాగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ వారికి సంబంధించిన పంట పొలాలకు మాత్రమే ఏదో కొంత నీరు అందిస్తున్నారు కానీ వారి పొలాలు నిండిన తర్వాత మిగతా వాళ్ళకి నీరు అందించలేని పరిస్థితిలో ఈ అధికార ప్రభుత్వం నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ తరపున అడుగుతున్నాము నువ్వు దేనికి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న పొలాలకు నీరు అందించలేని స్థితిలో ఉన్నందుకా జగన్ రెడ్డి….? మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే దిగువ స్థాయిలో గోదావరి, పెన్నా, కృష్ణ నదులు కలిగి ఉన్నాము కానీ ఆ నీరుని మేనేజ్మెంట్ చేసే పరిస్థితిలో లేనందుకు నువ్వు కావాలా జగన్ రెడ్డి..? అల్లాడిపోతున్న మన రాష్ట్ర రైతులను పట్టించుకునే పరిస్థితులలో లేవు అలానే వారి యొక్క అవసరాలు తీర్చలేని పరిస్థితిలో నువ్వు ఉన్నాందుకా జగన్ రెడ్డి..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.