నైట్ షూట్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీం

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.  ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొద్ది రోజులుగా నైట్ షెడ్యూల్ జరుపుకుంటుంది. చలికి వణుక్కుంటూ మరీ షూటింగ్ చేసి ఆర్ఆర్ఆర్ టీం ఈ షెడ్యూల్‌కు ప్యాకప్ చెప్పింది. చలకాలపు రాత్రులకు గుడ్ బై.. దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లబోతున్నాం అంటూ ట్వీట్ చేసింది.

యాక్షన్ సీక్వెన్స్ భారీ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుండగా, అల్లూరి సీతారామరాజు, కొమురం భీంలు ఇద్దరు కలిసిన తర్వాత ఈ ఫైట్ ఉండనుందని సమాచారం. చిత్రంలో 20 నిమిషాల పాటు ఈ ఫైట్ ఉంటుందట. జనవరి వరకు షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. సమ్మర్ వరకు సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.