యాక్సిడెంట్ కి గురైన యువకుడికి అండగా నిలిచిన జనసైనికులు

వైజాగ్ వెస్ట్: పాత గోపాలపట్నంలో నివసిస్తున్న 17 సంవత్సరాల రాంబాబు కు అనుకోని ప్రమాదంలో వెన్నుముక దెబ్బ తినడం జరిగింది. వారి తల్లి తండ్రులు ప్రమాదం జరిగిన వెంటనే కె.జి.హెచ్ కి తీసుకువెళ్లారు. వైద్యుల సలహామేరకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అక్కడ డబ్బులు ఎక్కువగా తీసుకొని సరిగ్గా పట్టించుకోలేదు. విషయాన్ని జనసైనికులు మని, నవీన్ లు జనసేన నరేంద్ర ద్రుస్టికి తేవడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ మరియు సురక్ష హాస్పిటల్ ఎం.డి బొడ్డేపల్లి రఘుతో మాట్లాడి ఆ యువకుడికి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. డిశ్చార్జ్ ఆనంతరం జనసైనికులు అందరు వెళ్లి రాంబాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకొని, నెలకి సరిపడా కిరాణా సరుకులు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. రాంబాబు తల్లి మాట్లాడుతూ మా అబ్బాయికి జనసేన వారు అందరు అండగా నిలబడి ఆపరేషన్ చేయించారు, మీ అందరికి రుణపడి ఉంటాం అని చెప్పారు. కష్టాల్లో ఉన్న వారికి ఎప్పుడు జనసేన అండగా ఉంటుంది అని జనసైనికులు ఆ కుటుంబానికి తెలియజేస్తూ బొడ్డేపల్లి రఘుకి, సంగం నరేంద్రకి కృతజ్ఞతలు తెలియజేసారు.