60 లక్షల మంది ఫాలోవర్స్‌తో రికార్డు సొంతం చేసుకున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ కేవలం సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతాడు. సమాజంలో జరుగుతున్న సమస్యలపై ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాల ద్వారా స్పందిస్తూనే సినిమా, పర్సనల్ విషయాలకు సంబంధించిన అన్ని రకాల అప్డేట్‌లను అభిమానుల చెంతకు చేరుస్తాడు. అందుకేనేమో సోషల్ మీడియాలో అతడు ఫాలోవర్స్‌తోనే రికార్డు సృష్టించాడు. తాజాగా మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ క్లబ్ లో చేరాడు. అంటే ఇప్పుడు మహేష్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య అక్షరాలా 60 లక్షలు అన్నమాట. ట్విట్టర్​లోను 10.9 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు మహేష్‌. ట్విటర్‌లో దక్షిణాది నటులకు అంత ఎక్కువ ఫాలోవర్స్‌ లేరు.

మహేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుచిత్రంతో పలకరించిన మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానుంది. ఇటీవల చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కాగా, ఈ కార్యక్రమానికి నమ్రత, సితార ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.