జనసేన పార్టీలో చేరిన కొత్తగూడెం, నీలవరం గ్రామాల యువత

అల్లూరీ సీతారామరాజు జిల్లా: జనసేన పార్టీ నాయకులు చేస్తున్న గ్రామపర్యటనలో భాగంగా ఆదివారం గూడెం మండలంలో కొత్తగూడెం, నీలవరం గ్రామాల యువత పిలుపు మేరకు వారి గ్రామాలను సందర్శించడమైనది. ఈ సందర్బంగా గ్రామ యువతతో ప్రత్యేకంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు గూడెం, జి.మాడుగుల, పాడేరు మండలాల నాయకులు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డా..గంగులయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ అధికార ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను వివరించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌళికసదుపాయలు కల్పించకపోగా గ్రామీణాభివృద్ధిపై శిత్తశుద్ధిలేని తీరు చూస్తుంటే ప్రజాప్రతినిధులకు అధికారమే శాశ్వతమనుకుంటున్నారని, గిరిజన యువతకు జీవో 3 రద్దుతో తీవ్ర అన్యాయం చేశారన్నారు. చింతపల్లి మండలం, ఎర్రవరం గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణ విధానానికి తూట్లుపొడుస్తూ పేసా గ్రామ కమిటీ తీర్మానం చెయ్యకుండా కడప బినామీ కంపెనీ శిరిడి సాయి ధర్మల్ పవర్ ఎలక్ట్రికల్ కంపెనీకి గుత్తాధిపత్యం ఇచ్చే ఆలోచన చెయ్యడం ఈ సోధ్యమంతా మన ప్రజాప్రతినిధులు చూస్తూ కూర్చోవడం ఎంతవరకు సబబు అన్నారు. ఇక్కడ గిరిజన ఎమ్మెల్యేలు నాలుగు మొక్కలు నాటి పర్యావరణ హితమైన జీవనం మేరగని స్టేట్మెంట్లు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. ఆదివాసీ సమాజాన్నీ నిర్వీర్యం చెయ్యడానికి అనేకరకమైన కుట్రలు చేస్తున్నారని గత మార్చ్ 24వ తేదీన బోయవాల్మీ కి అనే ఆర్ధిక, సామాజికంగా స్థిరపడిన కులాలను వెనకబడిన గిరిజనుల జాబితాలో కలపడానికి ప్రయత్నాంచడం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, వ్యతిరేకించలేని గిరిజన ప్రజాప్రతినిధులు దిక్కులు చూస్తూ బానిసత్వం ప్రకటించడం, ప్రజల ఆలోచన దారిమళ్లిస్తు స్టిక్కర్లు అతికిస్తూ ప్రచారార్భాటాలు చెయ్యడం, చూస్తే వీళ్ళకి గిరిజన జాతికోసం ఉన్న నిబద్ధత అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వైసీపీ కి ఇంకోసారి అధికారం ఇస్తే గిరిజన ప్రాంతాన్ని కార్పోరేట్ కంపెనీలకు అమ్మేస్తారని యువత బలంగా తమ గళం విప్పాల్సిన సమయం ఇదేనని అన్నారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ సిద్ధాంతాలు ఆశయాలు లక్ష్యాలు నచ్చి నీలవరం, కొత్తగూడెం గ్రామాల యువత డా. గంగులయ్య చేతులమీదుగా జనసేన పార్టీ కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. ఈ సమావేశంలో గూడెం మండల నాయకులు కొయ్యం బాలరాజు, బత్తుల సిద్దార్డ్ మార్క్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కార్యనిర్వహన అధ్యక్షులు తాంగుల రమేష్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, అశోక్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.