విజయ్‌ పార్టీ పెట్టారన్న ప్రచారంలో వాస్తవం లేదు

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై హైడ్రామా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు, గురువారం ఏకంగా ఆయన రాజకీయపార్టీని రిజిస్టర్‌ చేయించాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని విజయ్‌ సన్నిహితులు ఖండించారు. అందులో ఏమాత్రం నిజం లేదని  విజయ్‌ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు.

విజయ్‌ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ విజయ్‌ తండ్రి ఎ.చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చాలని అభిమానులు కోరుతున్నారన్నారు. విజయ్‌ మక్కల్ ఇయక్కంని ఆల్‌ ఇండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కంగా నమోదు చేశారని తెలిపారు. ఇది పూర్తిగా అభిమానుల కోరిక మేరకు జరిగిందన్నారు. మరోవైపు విజయ్‌ కూడా దీనిపై స్పందించారు. తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. తన తండ్రి నిర్ణయం మేరకు అభిమానులు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.